ప్రభుత్వాన్నిప్రశ్నిస్తేకేసులా?’
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

ప్రభుత్వాన్నిప్రశ్నిస్తేకేసులా?’


మాట్లాడుతున్న అమరనాథరెడ్డి తదితరులు

తిరుపతి(తాతయ్యగుంట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో యుద్ధ వాతావరణం సృష్టించి భావి తరాలకు ఏం సందేశం ఇద్దామని ఇలా చేస్తున్నారో వైకాపా నేతలు సమాధానం చెప్పాలని తెదేపా నేత, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభు త్వ వ్యతిరేతకను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెదేపా ప్రయత్నిస్తుంటే.. పోలీసులతో అర్ధరాత్రి అరెస్టులు చేయించి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా. తెదేపా నాయకులు, కార్యకర్తలు భయపడకండి. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయడానికి వస్తే సెక్షన్లు కనుక్కొని 41 నోటీసులు ఇవ్వాలని అడగండి. ప్రతి నియోజకవర్గంలో న్యాయవాదిని పెడుతున్నాం. ఏ కార్యకర్తకు ఇబ్బంది కలిగినా జిల్లా కమిటీ మొత్తం అక్కడి వచ్చి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తుంది’ అని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, కార్పొరేటర్‌ ఆర్‌సీ మునికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సందీప్‌, శ్రీధర్‌వర్మ, దంపూరి భాస్కర్‌, బుల్లెట్‌ రమణ, రవినాయుడు, చిట్టిబాబు, మనోహర్‌నాయుడు, విజయలక్ష్మి, సప్తగిరి ప్రసాద్‌, బ్యాంకు శాంతమ్మ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని