నిండుగా అరణియార్‌..
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

నిండుగా అరణియార్‌..

నేడు నీటి విడుదల

నాగలాపురం: పిచ్చాటూరులోని అరణియార్‌ జలాశయం జలకళను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 31 అడుగులు (1.853 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 29.6 అడుగుల మట్టానికి (1.67 టీఎంసీలు) చేరింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం జలాశయం గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయనున్నట్లు జల వనరుల శాఖ ఏఈ లోకేశ్వరరెడ్డి తెలిపారు. జలాశయంలో 29.5 అడుగుల నీటి నిల్వ ఉండేలా జాగ్రత్త వహిస్తూ అధిక నీటికి కిందకు విడుదల చేస్తామన్నారు. కాలువల్లో నీటి ప్రవాహం పెరుగనున్న దృష్ట్యా కాలువకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జలాశయం వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం గంగపూజ చేసి నీటిని విడుదల చేస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి, ఈఈ మదనగోపాల్‌, డీఈ రత్నారెడ్డి వస్తారన్నారు. నీటి విడుదల కార్యక్రమానికి పిచ్చాటూరు, నాగలాపురం మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు రావాల్సిందిగా ఆహ్వానించామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని