కర్ణాటక మద్యం స్వాధీనం.. నిందితుడి అరెస్టు
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

కర్ణాటక మద్యం స్వాధీనం.. నిందితుడి అరెస్టు


మద్యంతో పాటు అరెస్టు చేసిన నిందితుడిని చూపుతున్న పోలీసులు

చిత్తూరు(నేరవార్తలు) : చిత్తూరులోని చెర్లోపల్లి మలుపు వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ.3 లక్షలు విలువైన మద్యం, ఓ కారును స్వాధీనం చేసుకుని, నిందితుడు వినాయకం(29)ను అరెస్టు చేశారు. ఎస్సై రామకృష్ణ తన బృందంతో చెర్లోపల్లి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి వస్తున్న కారును అడ్డుకోగా.. అందులో ఉన్న ఇద్దరు పారిపోయారు. వినాయకంను అదుపులోకి తీసుకుని కారులో ఉన్న 1100మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన శివ, నందగోపాల్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

రూ.2 లక్షల విలువైన..

బంగారుపాళ్యం: చిత్తూరు-పలమనేరు జాతీయరహదారిలోని మొగిలి వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం రాత్రి అరెస్టు చేశామని ఎస్సై మల్లికార్జునరెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక నుంచి చిత్తూరు వైపు మద్యం తరలిస్తున్న మూడుకార్లలో రూ.రెండు లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రం హొస్కోట, ముళబాగల్‌కు చెందిన సయ్యద్‌, అఫ్రిద్‌, ఫైరోజ్‌ను అరెస్టు చేసి కార్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని