close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

అన్నదానానికి రూ.15 లక్షల ఆర్థిక సాయం

ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులకు రూ.15 లక్షల చెక్కు అందిస్తున్న దాత నరసింహారావు

తూర్పుపాలెం (మలికిపురం), న్యూస్‌టుడే: మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలోని ముత్యాలవారిగ్రూపులో వెలిసిఉన్న శ్రీసత్తెమ్మతల్లి, శ్రీగనికమ్మ తల్లి ఆలయం వద్ద అన్నదానం నిమిత్తం మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి నరసింహారావు(తాతాలు) రూ.15 లక్షల ఆర్థిక సాయం సమకూర్చారు. ఈ మొత్తాన్ని గురువారం ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సత్యదేవతా ఆలయ కమిటీకి చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారానికి ఒకసారి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు సమకూర్చిన తాతాలును అభినందించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.