close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

కాకినాడ-సికింద్రాబాద్‌ మధ్య జనసాధారణ రైలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు మూడురోజులపాటు జనసాధారణ రైలు నడుపుతున్నట్లు కాకినాడ్‌ టౌన్‌ రైల్వే చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ జి.వి.రమణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 07061 నంబరుగల రైలు రాత్రి 11.35 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుందన్నారు. 17, 18, 19 తేదీల్లో ఈ రైలు నడుస్తుందన్నారు. సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయన్నపాడు, ఖమ్మం టౌన్‌, వరంగల్‌, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందన్నారు. మొత్తం 14 జనరల్‌ బోగీలు ఉంటాయని ఆయన తెలిపారు.

 


 

పలు రైళ్ల రద్ధు. మరికొన్ని పాక్షికంగా..

 

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: గుంటూరు -నరసరావుపేట మార్గంలో పేరేచర్ల-సాతులూరు రైల్వే స్టేషన్ల మధ్య పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

* గుంటూరు నుంచి డోన్‌ వెళ్లే ప్యాసింజర్‌ రైలును ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు, డోన్‌ నుంచి గుంటూరు వచ్చే రైలును ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు రద్దు చేసినట్లు వెల్లడించింది.

గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు ఈ నెల 17 నుంచి 31 వరకు, కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటించింది. అదే విధంగా గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు, కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రద్దయ్యాయి.

ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4 వరకు భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మళ్లింపు మార్గంలో వయా కృష్ణా కెనాల్‌ గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4 వరకు బెంగళూరు నుంచి భువనేశ్వర్‌ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మళ్లింపు మార్గంలో వయా కాట్పాడి, రేణిగుంట, గూడూరు, కేసీ కెనాల్‌ మీదుగా భువనేశ్వర్‌ చేరుకుంటుంది.

ఈ నెల 31న పూరి నుంచి యశ్వంత్‌పుర వెళ్లే రైలు వయా కేసీ కెనాల్‌, గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా యశ్వంత్‌పుర చేరుకుంటుంది. వచ్చే నెల 1న యశ్వంత్‌పుర నుంచి పూరి వెళ్లే రైలు కాట్పాడి, రేణిగుంట, గూడూరు, కేసీ కెనాల్‌ మీదుగా పూరి వెళ్తుంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.