close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

కాకినాడ: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్‌ బాలురు అత్యాచారం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగు చూసింది. ఈ ఘటన టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గాలిపటాలు ఎగుర వేసేందుకు చిన్నారిని తీసుకెళ్లిన ఇద్దరు మైనర్‌ బాలురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు చెప్పారు. ఆడుకునేందుకు వెళ్లి తిరిగి వచ్చిన చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో చిన్నారి తల్లి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలను నిత్యం వీక్షించే నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పారు. పిల్లలు స్మార్ట్‌ ఫోన్లలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని డీఎస్పీ సూచించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.