close

మంగళవారం, మార్చి 31, 2020

తాజా వార్తలు

కాండ్రకోటలో శిలాఫలకాలు ధ్వంసం


గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన శిలాఫలకాలు

కాండ్రకోట(పెద్దాపురం), న్యూస్‌టుడే: పెద్దాపురం మండలం కాండ్రకోటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. పెద్దాపురం నుంచి కాండ్రకోట వరకు గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో ర.భ.శాఖ రహదారి విస్తరణ పనులు చేశారు. వాటికి అప్పట్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఆ రెండు శిలాఫలకాలపై ఆయనతోపాటు, ఎంపీపీ గుడాల రమేష్‌, గ్రామ సర్పంచి కుంచే గాంధీల పేర్లు ఉన్నాయి. ఆ శిలాఫలకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పెద్దాపురం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ పని ఎవరు చేశారో విచారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.