close

శనివారం, మార్చి 28, 2020

తాజా వార్తలు

జగనన్న చేదోడు జాబితాలపై పునఃపరిశీలన

24 నుంచి 28 వరకు ఇంటింటా సర్వే

మార్చి 16న లబ్ధిదారుల తుది జాబితా

వృత్తిదారులకు ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం

 

రీ సర్వేపై శిక్షణకు హాజరైన సచివాలయ సిబ్బంది

(అంతర చిత్రం) శిక్షణ ఇస్తున్న జేసీ-2 రాజకుమారి (దాచినచిత్రం)

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద గ్రామ, వార్డు వాలంటీర్లు గుర్తించిన లబ్ధిదారుల జాబితాపై పునః పరిశీలన చేయనున్నారు. అర్హులు మాత్రమే ఈ పథకంలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద దుకాణాలున్న రజక, నాయీబ్రహ్మణ, టైలరింగ్‌ వృత్తిదారులకు ఏటా రూ.10 వేలు చొప్పున అయిదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటా సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. వీటిలో కొన్ని లోపాలను గుర్తించిన ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ఉత్తర్వులు జారీ చేసి మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు వాలంటీర్లకు 23వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 24 నుంచి 28వ తేదీ వరకు గుర్తించిన జాబితాపై మరో దఫా సర్వే చేయనున్నారు. 29న లబ్ధిదారుల జాబితాలను రూపొందించి మార్చి 1న సచివాలయంలో ప్రదర్శించనున్నారు. మార్చి 7వ తేదీలోగా వీటిపై అభ్యంతరాలు స్వీకరణ, సామాజిక తనిఖీ నిర్వహించనున్నారు. 8, 9 తేదీల్లో గ్రామ/వార్డు సభ ఆమోదం తీసుకుంటారు. మార్చి 10, 11 తేదీల్లో కలెక్టర్‌ ఆమోదం తీసుకుని మార్చి 16న జగనన్న చేదోడు లబ్ధిదారుల తుది జాబితాలను సచివాలయాల్లో ప్రచురించనున్నారు.

అనర్హతలు:

ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యోగ విరమణ పింఛను పొందుతున్నవారు, ఆదాయపన్ను చెల్లించేవారు.

ఈ పథకం లబ్ధి కోసం తాత్కాలికంగా దుకాణాలు చూపి, వేరొక ప్రధాన వృత్తిలో కొనసాగుతున్నవారు

మాగాణి భూమి మూడు ఎకరాలకు పైబడి, మెట్ట భూమి 10 ఎకరాలకు పైబడినవారు. మాగాణి, మెట్ట భూమి 10 ఎకరాలకు పైబడినవారు.

కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నాలుగు చక్రాల సొంత వాహనం ఉండకూడదు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ ఉంటే మినహాయింపు.

పట్టణ ప్రాంతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 1,000 చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహం ఉండకూడదు

అర్హతలివీ:

గ్రామీణ ప్రాంతంలో లబ్ధిదారుడి కుటుంబం నెలసరి ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.10వేలు లోపు ఉండాలి. పట్టణాలు/నగరాలు/నగర పంచాయతీల్లో లబ్దిదారుని కుటుంబ నెలసరి ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.12వేలు మించకూడదు

లబ్ధిదారుని వయసు ఈ ఏడాది జనవరి 1వ తేదీన నాటికి 21 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి

రజకులు, నాయీబ్రహ్మణులు, టైలర్లు తహసీల్దారు జారీ చేసిన సమగ్ర కుల ధ్రువీకరణ పొంది ఉండాలి.

పటిష్టంగా రీసర్వే

జగనన్న చేదోడు పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాం. వీరిలో నిజమైన అర్హులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా రీసర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ జాబితాలపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తాం. - ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, కార్వనిర్వాహక సంచాలకురాలు, కార్పొరేషన్‌

ఇంటింటా సర్వేలో గతంలో గుర్తించిన లబ్ధిదారుల వివరాలు:

రజకులు - 11,631

నాయీబ్రహ్మణులు - 4,730

దర్జీలు - 46,720

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.