close

సోమవారం, ఏప్రిల్ 06, 2020

తాజా వార్తలు

సృజనాత్మకత పెంపునకే స్టూడెంట్‌ క్లబ్‌లు

నన్నయ ఉపకులపతి ఆచార్య జగన్నాథరావు

క్లబ్‌ కార్నివాల్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వీసీ ఆచార్య జగన్నాథరావు

నన్నయ విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి కొత్త ఆలోచనల ప్రేరణకు స్టూడెంట్‌ క్లబ్‌లు ఉపయోగపడతాయని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో క్లబ్‌ కార్నివాల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. దీనికి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పెర్సిస్‌ అధ్యక్షత వహించగా వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. క్లబ్‌ కార్నివాల్‌లో భాగంగా ఇంజినీరింగ్‌ కళాశాల్లోని నాలుగు విభాగాల్లో నాలుగు స్టూడెంట్‌ క్లబ్‌లను ఏర్పాటు చేశామని, వాటిద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. కంప్యూటర్‌ సైన్స్, ఇంజినీరింగ్‌ విభాగానికి బిట్‌-బ్లింగ్‌ ఇన్‌ ట్యాలెంట్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ కోసం వెక్టార్‌-డిఫైనింగ్‌ హైట్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి సంబంధించి ఇన్‌స్ట్రుమెంట్‌-జీని, సైన్స్, హ్యుమానిటీస్‌ విభాగానికి రైజ్‌-రీసెర్చ్, ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్సు, ఇంజినీరింగ్‌ పేరిట నాలుగు విభాగాలకు నాలుగు స్టూడెంట్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ క్లబ్‌లపై విద్యార్థులు రూపొందించిన లోగోలు వివరణాత్మకంగా, ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. క్లబ్‌ల ఏర్పాటులో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వి.పెర్సిస్‌ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని మిగిలిన కళాశాలల్లో సైతం స్టూడెంట్‌ క్లబ్‌లను ప్రారంభించాలని సూచించారు. అన్ని క్లబ్‌లలో ఉత్తమ విభాగాన్ని ఎంపిక చేసి రూ.10వేల నగదు బహుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు. క్లబ్‌ కార్నివాల్‌కు సంబంధించి విద్యార్థులు రూపొందించిన లోగో డిజైనింగ్, క్విజ్, జామ్‌(జస్ట్‌ ఏ మినిట్‌) వంటి పోటీల్లో విజేతలకు వీసీ చేతులమీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సురేష్‌ వర్మ, ఆచార్య టేకి, అధ్యాపకులు ఎం.కమలకుమారి, ఎన్‌.ఉదయభాస్కర్, శ్రీనివాసరాజు, ఎ.విజయదుర్గ, బి.లక్ష్మి, ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.