close

బుధవారం, జూన్ 03, 2020

తాజా వార్తలు

నిరాశ్రయులకు ఆహార పదార్థాల పంపిణీకి ఏర్పాట్లు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: వలస కూలీలు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీకి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంగళవారం నగరంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ సత్యనారాయణరావు మాట్లాడుతూ నిరాశ్రయులు, వలస కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వీరితోపాటు క్వారీ ఏరియా, ఐఎల్‌టీడీ, దివాన్‌చెరువు, వై-జంక్షన్‌, షెల్టాన్‌ హోటల్‌ తదితరచోట్ల ఆహారం పంపిణీ చేసేందుకు సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో మొత్తం వెయ్యి మందికి ఆహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.