గోదావరి, శబరి వరదలపై అప్రమత్తం
logo
Published : 24/06/2021 05:49 IST

గోదావరి, శబరి వరదలపై అప్రమత్తం


సమీక్షిస్తున్న కలెక్టర్, ఇతర అధికారులు

చింతూరు, న్యూస్‌టుడే: గోదావరి, శబరి నదులకు సంభవించే వరదల పట్ల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. వరదల పర్యవేక్షణకు మైదాన ప్రాంతాల్లోని ఆర్డీవో, సబ్‌కలెక్టర్‌ స్థాయి అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
చింతూరులో రూ.5 కోట్లతో నిర్మించనున్న వైటీసీ, 220/33 కేవీ విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ పనులకు కలెక్టర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు గిరిజనులకు భూమి పట్టాలు అందజేశారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ(రెవెన్యూ) లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టుల అధికారులు ప్రవీణ్‌ ఆదిత్య, ఆకుల వెంకటరమణ పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని