నిలువ నీడలేకున్నా..ఇల్లు నిర్మించుకున్నట్లు బిల్లు
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

నిలువ నీడలేకున్నా..ఇల్లు నిర్మించుకున్నట్లు బిల్లు

కాట్రేనికోన: ఇల్లు నిర్మించకుండానే తన పేరిట ఎవరో బిల్లు చేసుకున్నారని కాట్రేనికోన సుబ్రహ్మణ్యేశ్వర గుడి ప్రాంతానికి చెందిన కముజు రత్నకుమారి వాపోయారు. ఆమె భర్త కృష్ణ 20 ఏళ్ల కిందట చనిపోయారు. వారికి సొంత గూడు లేదు. ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇటీవల జగనన్న ఇంటి పథకంలో మరోసారి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా 2002లోనే ఇందిరా ఆవాస్‌ యోజనలో ఇంటి నిర్మాణానికి బిల్లు తీసుకున్నారని, స్థలానికి అనర్హురాలివంటూ అధికారులు తెలిపారన్నారు. గతంలో హౌసింగ్‌ అధికారులు చేసిన అక్రమాలను కప్పిపుచ్చి, ఉన్నతాధికారులకు రెవెన్యూ అధికారులు అవాస్తవ నివేదిక పంపడంతో తాను ఇంటిస్థలం కోల్పోయానని రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని