కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా స్వప్నిల్‌ కొనసాగింపు
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా స్వప్నిల్‌ కొనసాగింపు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఇక్కడే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వప్నిల్‌ను చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రెవెన్యూ)గా బదిలీ చేస్తూ గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ఆయన స్థానంలో ఇక్కడ ఎవర్నీ నియమించలేదు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మార్గదర్శకాలను అమలు చేయడంలో ఉత్తమ ఫలితాలు సాధించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఉన్నాయని ఇక్కడే కొనసాగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన్నే మున్సిపల్‌ కమిషనర్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన భార్య కాకినాడలోనే సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని