7 గంటలు... నిలకడగా నీటి మట్టం
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

7 గంటలు... నిలకడగా నీటి మట్టం

రాజమహేంద్రవరం నగరం: గోదావరి వరదల సమయంలో ఎన్నడూ లేనివిధంగా భద్రాచలంలో వరద ప్రమాద హెచ్చరికల జారీ, ఉప సంహరణల అనంతరం తొలిసారి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఆదివారం పరవళ్లు తగ్గినా ఆ రోజు సాయంత్రం కాటన్‌ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటి మట్టానికి చేరడంతో తొలి హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు 11.80 అడుగుల వద్ద నీటిమట్టం సుమారు ఏడు గంటలపాటు నిలకడగా కొనసాగి ఆశ్చర్యపరిచింది. అనంతరం 4 గంటల సమయంలో నీటిమట్టం 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆ సమయంలో సముద్రంలోకి 9,98,229 క్యూసెక్కులు వదిలామనిఅధికారులు తెలిపారు.

82 టీఎంసీలు కడలికి: కాటన్‌ బ్యారేజీ నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 82 టీఎంసీల వరద నీటిని సముద్రంలోకి వదిలామని అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నెమ్మదిగా పెరిగిన నీటిమట్టం గరిష్ఠంగా 11.80అడుగుల స్థాయికి చేరిందని, అనంతర పరిణామాల్లో నీరు వేగంగా సముద్రంపైపు పరుగుపెట్టిందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని