మత్స్యకారులు.. మూగజీవాల ప్రాణ రక్షకులు
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

మత్స్యకారులు.. మూగజీవాల ప్రాణ రక్షకులు

పడవలో ఆహారం తీసుకెళ్తున్న మత్స్యకారులు

దేవీపట్నం మండలంలోని గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. వరదల ఉగ్ర రూపానికి దేవీపట్నం, తొయ్యేరులో ఇళ్లన్నీ నీటమునిగాయి. ఈ క్రమంలో ఊళ్లలో ఉన్న కుక్కలు ఎత్తైన భవనాలపైకి ఎక్కి అక్కడే ఉండిపోగా మరికొన్ని వరద నీటిలో కొట్టుకుపోయాయి. వాటి దయనీయ పరిస్థితి గమనించిన దేవీపట్నంలోని మత్స్యకారులు కొన్నిరోజులుగా అన్నం వండి, పడవలపై తీసుకువెళ్లి వాటికి పెడుతున్నారు. చెట్లు, భవనాలపైనున్న కుక్కలను పడవలపై ఎక్కించుకుని కొండపై ఉన్న ఉమాచౌడేశ్వరస్వామి ఆలయం వద్దకు చేర్చుతున్నారు. పడవ కదిలితే కుక్కలన్నీ ఆహారం కోసం ఈదుకుని దగ్గరకు వస్తున్నాయని స్థానికుడు రామదాసు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, దేవీపట్నం

కుక్కకు తినిపిస్తున్న రామదాసు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని