హామీ నెరవేర్చాలని ఆందోళన
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

హామీ నెరవేర్చాలని ఆందోళన


కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలని, కరువు భత్యాన్ని వేతనం నుంచి మినహాయించే విధానాన్ని విరమించుకోవాలని, అర్హులకు ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2017లో విజయవాడలో వీఆర్‌ఏలు నిర్వహించిన ధర్నాకు ప్రతిపక్ష నేతగా హాజరైన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. వచ్చే నెల 2న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ధర్నాకు అంతా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి సంఘం గౌరవాధ్యక్షుడు చెక్కల రాజ్‌కుమార్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరభద్రం, సత్యనారాయణ నాయకత్వం వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని