ఎస్సైనంటూ ఫోన్‌లో వాలంటీరు బెదిరింపు
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

ఎస్సైనంటూ ఫోన్‌లో వాలంటీరు బెదిరింపు

మామిడికుదురు: మగటపల్లికి చెందిన ఓ వాలంటీరు నకిలీ ఎస్సైగా అవతారమెత్తి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ఫోన్‌లో బెదిరించిన వ్యవహారంపై పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌గా మారడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలన చేస్తున్నారు. ఇందులో నకిలీ పోలీసుగా ఉన్న మరో వ్యక్తిపై కూడా ఆరా తీస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎస్సై షేక్‌జానీ బాషాను వివరణ కోరగా పరిశీలన జరుగుతోందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని