Published : 27/07/2021 06:31 IST

నిబ్బరం చెప్పారు ..నిండా ముంచారు!

వరద ముందస్తు సన్నద్ధత అమలు అంతంతే

 శాశ్వత పరిష్కారం దిశగా కానరాని చర్యలు

పైసల్లేకుండా.. పునరావాసం ఎలా?

వి.ఆర్‌.పురం: రేఖపల్లిలో తాత్కాలిక రెయిన్‌ ప్రూఫ్‌ షెడ్లు

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్, దేవీపట్నం ముంపు ముంచుకొస్తోంది.. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాక ఆ తీవ్రత మరింత పెరిగింది. ఆగస్టులో విపత్తులకు పరిస్థితి మరింత కష్టమనే చర్చ నడుస్తోంది. జిల్లాలో వరద నివారణకు ఏటా ముందస్తు సన్నద్ధత ప్రకటిస్తున్నా.. అమలులో లోపాలు సుస్పష్టం. ఏటా జులై నుంచి సెప్టెంబరు వరకు గోదావరి ఉగ్రరూపంతో ప్రజలు పాట్లు పడుతున్నా.. ముంపు సమస్యకు పరిష్కారం ఊసేలేదు. నిరుడు వ΄డు నెలలు వరదలు, భారీ వర్షాలు వెంటాడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గత అనుభవాల వేళ ఈ ఏడాది పలుమార్లు ముందస్తు సమావేశాలు పెట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించినా అమలుకాని దయనీయమిది.

నిర్ణయం: పునరావాస  కేంద్రాలకు భవనాల గుర్తింపు

తాజా పరిస్థితి: మన్యంలో  కోనసీమలో 65, రాజమహేంద్రవరం డివిజన్‌లో 8, రామచంద్రపురం పరిధిలో ఆరు, కాకినాడ పరిధిలో ఒకటి చొప్పున పునరావాస కేంద్రాలు గుర్తించారు. ఎటపాక డివిజన్‌లో 30 వేల కుటుంబాల పునరావాసానికి వీలుగా రెయిన్‌ ప్రూఫ్‌ షెల్టర్లు నిర్మించారు.

ముంపు బాధితుల తరలింపు

కొండపై ఒకే గుడారంలో పది మందికిపైగా..

దేవీపట్నం మండలంలో  36 గ్రామాలు ముంపులో ఉన్నాయి. కొండమొదలు పరిధి 11 గ్రామాల్లో 800 కుటుంబాల్లో.. 200 పునరావాస కాలనీలకు వెళ్లాయి. పి.గొందూరులో 50 కుటుంబాలు మినహా మిగిలినవారు పునరావాస కాలనీలకు వెళ్లారు. ఎ.వీరవరం గ్రామస్థులు కూడా ఆ కాలనీలకు చేరారు. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినా.. అక్కడికి తరలించే పరిస్థితి లేదు. ఆర్‌అండ్‌ఆర్, భూ సమస్యలు పరిష్కరిస్తేనే గ్రామం వదిలి వెళ్తామని గిరిజనులు కొన్నిచోట్ల మొండికేశారు. మన్యాన్ని వరద ఆవహించినా వారిని పునరావాస కేంద్రాలకు తరలించలేదు. చాలామంది కొండల మీదకు చేరారు. 

ప్రత్యేక కార్యాచరణ

ముందస్తు కార్యాచరణ మేరకు చర్యలు చేపట్టాం. పునరావాస కేంద్రాలను గుర్తించాం. నిత్యావసరాలు ముందే మండలాలకు పంపాం. బోట్లు, లాంచీలు సిద్ధం చేశాం. విలీన మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. కొవిడ్‌ నిబంధనల మేరకు పునరావాస ఏర్పాట్లు చేశాం. వ΄డు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాం. - సత్తిబాబు జిల్లా రెవెన్యూ అధికారి

వరద సహాయక చర్యలకు  రూ.5 కోట్ల ప్రతిపాదనలు

జిల్లాకు రూ.5 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే రూ.50 లక్షలు మంజూరు చేసినా విడుదల కాలేదు. సహాయ, పునరావాస కేంద్రాల నిర్వహణ, బోట్లు ఏర్పాటు, ఇతర అవసరాలకు నిధులు అవసరం. నిరుడు వరదలకు రూ.7.38 కోట్లు ఖర్చు చేస్తే ఇంకా రూ.3.86 కోట్లు చెల్లించలేదు.

దారులకు ప్రత్యామ్నాయం 

దేవీపట్నం- రంపచోడవరం, దండంగి- పోశమ్మగండి,మంటూరు- చినరమణయ్యపేట దారులు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయం లేదు. చింతూరు మీదుగా  ఆంధ్ర-ఒడిశా జాతీయ రహదారిపై వరద చేరి రెండు రోజులు రాకపోకలు ఆగినా ప్రత్యామ్నాయం లేదు. ఎట్టకేలకు నీరు తగ్గి సోమవారం రాకపోకలు సాగాయి. పి.గన్నవరం పరిధిలో అడిగిలవారిపేట, బూరుగులంక, ఊడివ΄డిలంక, జి.పెదపూడిలంకకు రాకపోకలు సాగాలంటే వారధి కట్టాల్సిందే. 

బోట్లకు అనుమతులు

బాధితుల తరలింపునకు బోట్ల ఏర్పాటు, వినియోగంపై సన్నద్ధత లేదు. కచ్చులూరు ఘటన తర్వాత పోర్టు అధికారులు బోట్లకు అనుమతివ్వాలి. బోటు, సరంగు లైసెన్స్‌ తనిఖీ చేసి, సామర్థ్యం పరిశీలించాలి.  గత నెలలో 23 బోట్లకు మాత్రమే అనుమతి దక్కాయి. కోనసీమ లంకల్లో చిన్నబోట్లపై ప్రజలను తరలిస్తున్నారు.

బలహీన ఏటిగట్ల గుర్తింపు.. రక్షణ చర్యలు..నిరంతర పర్యవేక్షణకు సిబ్బంది

బలహీనంగా ఉన్న గట్లు పటిష్ఠం, ఫ్లడ్‌ స్టోర్స్‌ నిర్వహణ, సిబ్బంది ఏర్పాటుకు నిర్ణయించినా నిధుల లేమితో అమలు ఊసేలేదు. ప్రస్తుతం గట్ల వెంట పర్యవేక్షణ పెంచి, అవసరమైన సామగ్రి సిద్ధం చేస్తున్నారు. సమర్థ సేవలకు 900 మంది అవసరమైతే.. 240 మందే ఉన్నారు. పొరుగు సేవల సిబ్బంది ఏర్పాటు ప్రతిపాదన సాకారం కాలేదు. లంకలు కోతకు గురై కొబ్బరి, ఇతర తోటలు కొట్టుకుపోతున్నాయి. రక్షణ గోడల ఏర్పాటు కలగానే ఉంది.

పి.గన్నవరం వద్ద ముంపులో బెండతోట 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని