వివాహిత హత్య.. భర్త పరారు
eenadu telugu news
Updated : 15/09/2021 06:34 IST

వివాహిత హత్య.. భర్త పరారు


భారతి మాణిక్యం

పిఠాపురం: పిఠాపురంలో భార్యను హతమార్చిన వ్యక్తి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. శంఖవరానికి చెందిన పంచాది చిన సుబ్బారావు(నాని)కి పిఠాపురం వాసి భారతి మాణిక్యం(27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. చినసుబ్బారావు మద్యానికి అలవాటుపడి, పనికి వెళ్లకపోవడంతో అత్తమామలు వారిని ఎనిమిదేళ్ల క్రితం పిఠాపురం తీసుకొచ్చారు. రాజీవ్‌ గృహకల్పలో ఇల్లు కొనిచ్చారు. ఆ తరువాతా సుబ్బారావులో మార్పు రాలేదు. వీరి కుటుంబ పోషణకు ఆమె తల్లిదండ్రులే ఆర్థిక సాయం చేస్తుండేవారు. పూర్తిగా మద్యం మత్తుకు బానిసైన చిన సుబ్బారావు భార్యను తరచూ డబ్బుల కోసం వేధిస్తూ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పదేళ్లయినా వీరికి సంతానం కలగకపోడం.. నిత్యం ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో సోమవారం రాత్రి వాదులాడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున చిన సుబ్బారావు జగ్గయ్య చెరువులోనే మరో చోట నివాసం ఉంటున్న భారతి మాణిక్యం అక్క ఇంటికి వెళ్లాడు. తన భార్య కిందపడిపోయి మాట్లాడటం లేదని చెప్పాడు. వారి వచ్చిచూసేసరికి ఆమె మృతి చెంది ఉండటంతో సుబ్బారావు పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్‌, ఎస్సై శంకరరావు పరిశీలించి వివాహిత మెడ భాగంలో తీగ బిగించి హతమార్చినట్లు గుర్తించారు. చినసుబ్బారావుకోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని