పారదర్శక ఓటరు జాబితానే లక్ష్యం
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

పారదర్శక ఓటరు జాబితానే లక్ష్యం


కలెక్టర్‌ హరికిరణ్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఓటర్ల జాబితా సవరణ-2022ను పారదర్శకంగా చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్‌ ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ జిల్లా ఎన్నికల అధికారులతో అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. తర్వాత కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ, నవంబరు 1న జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారనీ, అప్పటి నుంచి నవంబరు 30 వరకు కొత్త ఓటు నమోదు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఈఆర్‌వోలకు ఆదేశించారు. నవంబరు 20, 21న ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించాలన్నారు. డిసెంబరు 20 నాటికి అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలన్నారు. హెల్ప్‌లైన్‌, మొబైల్‌ యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రారంభించిన ఓటర్ల జాబితా ఇంటింటా పరిశీలన ప్రక్రియను అక్టోబరు 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గవ్‌తేజ, డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో సత్యనారాయణ, మెప్మా పీడీ కె.శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని