దిగ్వి జేఈఈ భవ!
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

 దిగ్వి జేఈఈ భవ!

జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు ప్రతిభ మెరిశారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 500లోపు ఐదుగురు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో ముగ్గురు మన జిల్లా పిల్లలు కాగా.. మరో ఇద్దరు మన జిల్లా పరిధిలోని విద్యాసంస్థల్లో చదువుతున్న ప.గో. వారు కావడం గమనార్హం.

మద్రాస్‌లో ఐఐటీ సీటు సాధిస్తా..

156

నా పేరు చిక్కాల లక్ష్మణరావు. కాకినాడ ఆర్‌.ఆర్‌.నగర్‌లో ఉంటున్నాం. నాన్న శ్రీనివాస్‌ బ్యాంకు ఉద్యోగి, అమ్మ రోహిణీదేవి గృహిణి. చిన్నతనం నుంచి చదువు, కంప్యూటర్‌ అంటే చాలా ఇష్టం. రోజూ 6 గంటలు శ్రమించి సాధన చేశా. అఖిలభారత స్థాయి ఓపెన్‌ విభాగంలో 156వ ర్యాంకు సాధించా. మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి కంప్యూటర్‌ సైన్సులో బీటెక్‌ పూర్తి చేస్తాం నూతన టెక్నాలజీ రూపొందిస్తా. -దానవాయిపేట, భానుగుడి సెంటర్‌

సైన్స్‌ టెక్నాలజీలో రాణిస్తా..

165

నా పేరు ఎస్‌.భాను వీరసాయి సురేంద్రవర్మ. మాది సీతానగరం మండలం ఉండేశ్వరపురం. నాన్న నాగేశ్వరరావు రైతు. తల్లి వరలక్ష్మి గృహిణి. ఓబీసీ కేటగిరిలో 21, ఆల్‌ ఇండియా స్థాయిలో 165వ ర్యాంకు సాధించా.నా లక్ష్యం అడ్వాన్స్‌ పరీక్ష. అందులో 100లోపు ర్యాంకు సాధనకుశ్రమిస్తున్నా. 10లో 10 పాయింట్లు, ఇంటర్‌లో 984 మార్కులు సాధించా. ఎంసెట్‌లోనూ 13వ ర్యాంకు వచ్చింది. భవిష్యత్తులో సైన్స్‌ టెక్నాలజీలో నూతన ప్రయోగాలు చేయాలనేది కల.

రోజుకు పదిగంటలు చదివా..

454

నా పేరు సి.శివ మాధవ్‌. మాది బొమ్మూరు. నాన్న ప్రైవేటు ఉద్యోగి. అమ్మ శ్రీదేవి గృహిణి. ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరిలో 454 ర్యాంకు వచ్చింది. పదిలో పది పాయింట్లు, ఇంటర్‌లో 980 మార్కులు సాధించా. ఎంసెట్‌లోనూ 60వ ర్యాంకు వచ్చింది. రోజుకు పది గంటలు ప్రణాళిక మేరకు చదివా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నది నా కల.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని అవుతా..

430

నా పేరు వై.హిమబిందునా. మాది ఆకివీడు వద్ద పోలాపర్రు. నాన్న కృష్ణమూర్తి రైతు. అమ్మ అరుణ. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో 38, ఆల్‌ ఇండియాలో 430 ర్యాంకు వచ్చింది. పదిలో పది పాయింట్లు, ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. రోజుకు 8-10గంటలు చదివా. ఎంసెట్‌లో 301 ర్యాంకు వచ్చింది. సీఎస్‌ఈ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడతా.

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఏర్పాటే లక్ష్యం

259

నా పేరు కె.సాయిరాజ్‌. మాది పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు. నాన్న మహేంద్ర ప్రైవేటు ఉద్యోగి. అమ్మ నాగలక్ష్మి గృహిణి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో 23, ఆల్‌ ఇండియా స్థాయిలో 259వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌ పరీక్షకు సాధన చేస్తున్నా. రోజుకు తొమ్మిది గంటలు శ్రమించా. 10లో 10 పాయింట్లు, ఇంటర్‌లో 987 మార్కులు సాధించా. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో స్థిరపడాలనేది నా కల. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థను నెలకొల్పాలన్నది నా ఆశయం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని