పోలీసులు చోద్యం చూడటమేంటి?: ఎంపీ భరత్‌
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

పోలీసులు చోద్యం చూడటమేంటి?: ఎంపీ భరత్‌

సీతానగరం: ఒక అధ్యాపకుడిపై వందమందికి పైగా దాడిచేస్తుంటే పోలీసులు చోద్యం చూడడమేమిటని, ఎందుకు లాఠీఛార్జి చేసి రక్షించలేకపోయారని ఎంపీ భరత్‌ ప్రశ్నించారు. సీతానగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు పులుగు దీపక్‌పై మంగళవారం రాత్రి వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎంపీ ఆయన్ని పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వీడియో ఫుటేజీల్లో నిందితులంతా స్పష్టంగా కనిపిస్తున్నారన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఆదివాసీ అధ్యాపకుడిపై దాడులకు దిగడం దుర్మార్గమైన చర్య అన్నారు. నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న పాత్రధారులు, సూత్రధారులంతా జైలుకు పంపించేలా ఈ ఘటనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీపక్‌ కారును అడ్డగించి ఇనుపరాడ్లతో అద్దాలు పగలగొట్టి అవే రాడ్లును కారులో వేస్తే ప్రాణభయంతో ఆయన స్వీయరక్షణ కోసం వాటిని పట్టుకున్నారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా బాధితులకు అండగా ఉంటానన్నారు. సామాజిక మాధ్యమాల్లో దీపక్‌ లాంటి మంచి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేసేలా కొంతమంది పోస్టింగులు పెడుతున్నారని అవన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లతామన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారి ఫోన్‌ కాల్‌డేటాను బయటకు తీయిస్తామన్నారు. ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అని, వైకాపా దీపక్‌ కుటుంబానికి అండగా నిలుస్తానన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో రైతులకు రావాల్సిన పరిహారంపై జరుగుతున్న అన్యాయాన్ని పలువురు ఎంపీ భరత్‌కు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని