పసుపు దళం... పోరు గళం
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

పసుపు దళం... పోరు గళం


జగ్గంపేటలో జ్యోతుల నవీన్‌ బైఠాయింపు

 

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే బృందం: ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు పోతున్నాయి. ధాన్యానికి మద్దతు ధర లేదు.. ధాన్యం బిల్లుల చెల్లింపు ఊసే లేదు.. కౌలు రైతుల వేదన వర్ణనాతీతం.. అన్నదాతకు అడుగడుగునా అవస్థలు.. కన్నీళ్లు పట్టని పాలకులు.. తీరు మారాలి.. రైతన్నను ఆదుకోవాలని తెలుగు తమ్ముళ్లు నినదించారు. ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా 16 నియోజకవర్గాల్లో ఆందోళనలు సాగాయి. పలుచోట్ల పోలీసులు కొద్దిమందికి మాత్రమే వినతులు ఇచ్చేందుకు అనుమతిస్తే.. ప్రదర్శనలు అడ్డుకున్న చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంపేటలోని ఏడీబీ రోడ్డులో రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ అంతరాయం కలిగించారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తదితరులపై కేసు నమోదు చేశారు.

సామర్లకోటలో చినరాజప్ప అడ్డగింత

 

ఎక్కడికక్కడ ఆందోళన..

 పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో సామర్లకోటలో గాంధీ బొమ్మ కూడలిలో 60 ట్రాక్టర్లతో ర్యాలీకి సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాదయాత్ర చేశారు.

 జగ్గంపేటలో జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా వారికి చిక్కకుండా పార్టీ శ్రేణులతో సాగారు.  తునిలో యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కొందరితో కలిసి వెళ్లి తహసీల్దారుకు వినతిపత్రం అందించారు.  కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిమందితో కాలినడకన కలెక్టరేట్‌కు వచ్చి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. ú కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో కరపలో ప్రదర్శన సాగింది.  మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భారీ ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు.  ప్రత్తిపాడు బాధ్యుడు వరుపుల రాజా ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.  రామచంద్రపురంలో బాధ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం హౌసింగ్‌ బోర్డు నుంచి మెయిన్‌ రోడ్డు వరకు ప్రదర్శనగా సాగారు.  అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ప్రదర్శనను నల్ల వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి బైఠాయించి.. ఆర్డీవో వసంతరాయుడుకు విన్నవించారు. ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ కడియం తహసీల్దారు కార్యాలయానికి కార్యకర్తలతో వెళ్లారు. తహసీల్దారు లేకపోవడంతో కార్యాలయ గోడపై వినతిపత్రం అంటించారు. ఆలమూరులో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ట్రాక్టర్‌ నడిపి నిరసన తెలిపారు.  పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలతో పాదయాత్ర చేశారు.  అమలాపురం పార్లమెంటు తెదేపా నేత హరీష్‌ మాథుర్‌ పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో ట్రాక్టర్‌ నడిపి నిరసన తెలిపారు.  మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో రాజోలులో నిరసన ప్రదర్శన సాగింది.

రంగంపేటలో నల్లమిల్లి నిరసన


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని