తితిదే పాలక మండలి సభ్యుడిగా మల్లాడి
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

తితిదే పాలక మండలి సభ్యుడిగా మల్లాడి

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావును తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ అవకాశం లభించడం ఇదే ప్రథమం. స్వామివారికి, భక్తులకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల అభివృద్ధికి, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని