పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం


మాట్లాడుతున్న ప్రసన్నకుమార్‌

పెద్దాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 1.46 లక్షల ఇళ్లకు సంబంధించి రూ.3,800 కోట్లు భరించేందుకు పభుత్వం సిద్ధంగా ఉందని టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ తెలిపారు.వాలుతిమ్మాపురంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఎంపీ గీత, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దొరబాబుతో కలిసి బుధవారం పరిశీలించారు. బ్యాంక్‌ మేనేజర్లు, మెప్మా అధికారులతో సమీక్షించారు.పెద్దాపురంలోని 17,500 గృహాలకు రూ.56 కోట్లు ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చినరాజప్ప, పురపాలక ఛైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయారు, ఎస్‌ఈ బి.శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ జె.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని