ఆదిత్యకు అత్యుత్తమ ర్యాంకులు
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

ఆదిత్యకు అత్యుత్తమ ర్యాంకులు


నవీన్‌

హేమసాయిదొరబాబు

మసీదుసెంటర్‌(కాకినాడ): జేఈఈ మెయిన్‌-21 ఫలితాల్లో ఆద్యిత విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి తెలిపారు. ఫలితాల్లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో సీహెచ్‌ లక్ష్మణరావుకు 156వ ర్యాంకుతో ఉభయగోదావరి జిల్లాల్లో మొదటి స్థానం సాధించారన్నారు. అన్ని కేటగిరీల నుంచి సీహెచ్‌ నవీన్‌ 80వ ర్యాంకు, కె.హేమసాయిదొరబాబు 85, గీతాచరణ్‌ 141, చిక్కాల శ్రీ లక్ష్మణరావు 156, తేజశ్రీహర్ష 214, నందిపాటి సంతోష్‌ 232, అఖిల్‌ 238, అనుపమ 308, శ్రావ్యచైత్ర 314, హేమశ్రీ 463, అచ్యుతరామమూర్తి 512 ర్యాంకులు సాధించారన్నారు. వారిని శేషారెడ్డి అభినందించారు. అఖిల భారత స్థాయిలో అన్ని కేటగిరిల నుంచి 1,000లోపు 20, 5,000లోపు 48, 10,000లోపు 92, 15,000లోపు 138, 20,000లోపు 172 మంది విద్యార్ధులు ర్యాంకులు సాధించారన్నారు. వారిని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ కృష్ణదీపక్‌రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు ఎన్‌.శృతి, ఎన్‌.సుగుణ, ప్రిన్సిపల్‌ మెయిన, లక్ష్మీకుమార్‌, రాఘవరెడ్డి, గంగిరెడ్డి, ఫణీంద్ర తదితరులు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని