రాష్ట్ర ర్యాంకులతోసత్తా..
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

రాష్ట్ర ర్యాంకులతోసత్తా..


ర్యాంకులు సాధించిన విద్యార్థులతో విద్యాసంస్థల ఛైర్మన్‌ శ్రీధర్‌

రాజమహేంద్రవరం(దానవాయిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్‌ 2021లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డిసాయి విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించిందని ఆ విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య తెలిపారు. తమ విద్యార్థుల్లో సిహెచ్‌.మాన్విత మూడు, టి.శివసుహాస్‌ 26, డి.జయప్రకాష్‌, ఎం.మృదుల 42, ఎ.జైదీప్‌ శ్రీవాస్‌ 68వ ర్యాంకు సాధించారన్నారు. మూడో ర్యాంకు సాధించిన మాన్వితను అభినందిస్తూ విద్యాసంస్థల ఛైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ రూ.50 వేలు నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థినీ విద్యార్థులను డైరెక్టర్‌ శ్రీవిద్య, లక్ష్యా ప్రోగ్రాం డీన్‌ కె.శ్రీనివాస్‌ తదితరులు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని