పాలిసెట్‌లో తిరుమల విజయభేరి
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

పాలిసెట్‌లో తిరుమల విజయభేరి


విద్యార్థులను అభినందిస్తున్న విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమలరావు

రాజమహేంద్రవరం(దానవాయిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరం తిరుమల ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు మొదటి 50లోపు తొమ్మిది ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. కె.వివేక్‌ వర్ధన్‌ రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు, పీఎస్‌ఎస్‌.చంద్ర శ్రీతేజ, కె.గంగా ధనశ్రీలకు మూడో ర్యాంకు, సీహెచ్‌ఎన్‌వీఎస్‌ఎమ్‌ఎస్‌ రాజీవ్‌ లోచన్‌ 14, వి.భార్గవ కృష్ణ 19, జీవీఎస్‌జిఎన్‌ వర్షిత్‌, పి.సునీతలకు 26వ ర్యాంకు, వీఎస్‌ఎస్‌.తేజశ్విని 31, ఆర్‌.శివ ప్రజిత్‌ 42, ఎం.హర్ష యోగానంద భారతి 73, ఎంఎం.పృథ్విసాయి 93, ఎ.సుహిత 98వ ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల డైరెక్టర్‌ సరోజినిదేవి, అకడమిక్‌ డైరెక్టర్లు జి.సతీష్‌బాబు, సిహెచ్‌.శేషుబాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరి తదితరులు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని