ఆదర్శనీయుడు విశ్వేశ్వరయ్య
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

ఆదర్శనీయుడు విశ్వేశ్వరయ్య

చిత్రపటానికి పూలమాల వేస్తున్న సీఈలు సుధాకర్‌బాబు, పుల్లారావు

రాజమహేంద్రవరం నగరం: ఇంజినీర్లకు మార్గనిర్దేశం చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అదర్శనీయుడని పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్‌బాబు, గోదావరి డెల్టా సిస్టం సీఈ ఎన్‌.పుల్లారావు పేర్కొన్నారు. ఏపీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజినీర్ల దినోత్సవాన్ని బుధవారం ధవళేశ్వరంలోని జలవనరుశాఖ కార్యాలయాల వద్ద నిర్వహించారు. కాటన్‌ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కాకినాడ నగరం: కాకినాడలోని ఎస్‌ఈ కార్యాలయంలో బుధవారం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ఏఈలు, డీఈలు, ఈఈలు, ఇంజినీరింగు అసిస్టెంట్లకు ఉత్తమ ఇంజినీర్లుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజినీరు (ఎస్‌ఈ) ఎం.శ్రీనివాస్‌ చేతులమీదుగా అందజేశారు డిప్లొమో, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అన్యం రాంబాబు ఈఈలు మూర్తి, ప్రసాద్‌, విజయ్‌కుమార్‌, జేఏసీ అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని