నెలరోజుల్లో వివాహం.. అంతలోనే విషాదం
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

నెలరోజుల్లో వివాహం.. అంతలోనే విషాదం

విద్యుదాఘాతంతో యువకుడి మృతి


నూకరాజు (దాచిన చిత్రం)

కరప, న్యూస్‌టుడే: జీవితం మీద ఎన్నో ఆశలతో, రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకుందామనుకున్నాడు. ఎంతో సంతోషంగా నెల రోజుల్లో వివాహం చేసుకుందామనుకున్న ఆ యువకుడి ఆశలు విద్యుదాఘాతం రూపంలో ఆవిరయ్యాయి. కుమారుడి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. కరప పోలీసుల వివరాలు మేరకు.. ఉప్పలంకకు చెందిన వైదాడి నూకరాజు(22) స్థానిక గ్రామపంచాయతీలో పది రోజుల క్రితం కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం గ్రామంలోని వీధి లైట్లు మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. మూడు స్తంభాలకు మరమ్మతులు చేసిన తర్వాత, నాలు గోది ఎక్కగానే ఒక్కసారిగా విద్యుత్తు ప్రసరించడంతో కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఇతడికి ఇటీవలే కరపకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ దుర్ఘటన విషయం తెలియగానే ఒక్కగానొక్క కుమారుడు దూరమయ్యాడని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు హృదయవిదారకం. మృతుడి తండ్రి విశాఖ ఫిర్యాదుతో ఏఎస్సై జి.ప్రసన్నకుమార్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

దుస్తులు ఆరబెడుతుండగా మహిళ..

పెద్దాపురం: పెద్దాపురం పట్టణం గణేష్‌ కాలనీకి చెందిన ప్రత్తిపాటి రాణి(50) ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. దుస్తులు ఉతికి మేడమీదకు వెళ్లి తీగపై వేస్తుండగా పైన ఉన్న 32 కేవీ తీగల ద్వారా విద్యుత్తు ప్రవహించి ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పెద్దాపురం ఎస్సై ఆర్‌.మురళీ మోహన్‌ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరించి కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని