నోటాకు 635 ఓట్లు
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

నోటాకు 635 ఓట్లు

రాజానగరం: రాజానగరం మండలం కానవరం ఎంపీటీసీ స్థానానికి వైకాపా నుంచి కోడి రాఘవ(వీరరాఘవ), తెదేపా నుంచి కొండా మరియమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు పూర్తయిన అనంతరం వీరిద్దరు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తెదేపా అభ్యర్థి ప్రచారానికి విముఖత వ్యక్తం చేస్తూ స్తబ్దుగా ఉండిపోయారు. దీంతో తెదేపా వర్గీయులందరూ ఆమెకు బదులు నోటాకు ఓట్లు వేశారు. 1949 ఓట్లు పోల్‌ కాగా, వైకాపా అభ్యర్థికి 1190, మరియమ్మకు 93 ఓట్లు లభించాయి. నోటాకు 635 ఓట్లు పోలయ్యాయి. 31 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. విజయం సాధించిన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కంటే ఎక్కువగా నోటా ఉండటం గమనార్హం.

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని