నాలుగు ఓట్లతో జనసేన విజయం
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

నాలుగు ఓట్లతో జనసేన విజయం

సిరిపురం ఎంపీటీసీ స్థానం ఫలితంపై వివాదం


ఫలితాన్ని ప్రకటించాలని కోరుతున్న జనసేన ఇన్‌ఛార్జి నానాజీ

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కరప మండలం సిరిపురం ఎంపీటీసీ స్థానంలో వైకాపా అభ్యర్థి రొక్కాల నాగమణిపై జనసేన అభ్యర్థి కత్తుల ధనలక్ష్మి 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై వైకాపా ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌటింగ్‌కు డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్జి పంతం నానాజీ అక్కడికి చేరుకుని ఫలితం వెంటనే ప్రకటించాలని పట్టుబట్టారు. లెక్కింపు కేంద్ర ఇన్‌ఛార్జి, కాకినాడ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతిపజేశారు. ఆరో సమక్షంలో మరో దఫా లెక్కించగా జనసేన అభ్యర్థినికి నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చినట్లు విజయాన్ని ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని