రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు: గోరంట్ల
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు: గోరంట్ల


ఎమ్మెల్యే గోరంట్లకు పుష్పగుచ్ఛం అందిస్తున్న తెదేపా రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి కల్యాణి

 

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని, వారు స్వేచ్ఛగా బయట తిరగలేని స్థితికి రాష్ట్రాన్ని చేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. తెదేపా రాష్ట్ర మహిళా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన ముల్పూరి కల్యాణి ఆదివారం రాజమహేంద్రవరంలోని బుచ్చయచౌదరి నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ... నూతనంగా ఏర్పాటైన కమిటీలోని సభ్యులంతా మహిళలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంతోపాటు వారి సమస్యలపై పోరాడాలన్నారు. కల్యాణి మాట్లాడుతూ పార్టీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతోపాటు తనవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తానని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని