లోవకు పోటెత్తిన భక్తులు
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

లోవకు పోటెత్తిన భక్తులు

కిక్కిరిసిన క్యూలైన్లు

 

తుని గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించడంతో ఆ సమయానికి అనుగుణంగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఈ ఒక్క రోజే 12 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.4.02 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో విశ్వనాథరాజు తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని