జడ్పీటీసీగా కడియపులంక సర్పంచి
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

జడ్పీటీసీగా కడియపులంక సర్పంచి

కడియం: కడియం మండలంలో ఆదివారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. హోరాహోరీగా చివరి వరకు సాగిన ఫలితాల లెక్కింపులో తెదేపా, జనసేన మైత్రి విజయం సాధించింది. జనసేన పార్టీ నుంచి జడ్పీటీసీ అభ్యర్థినిగా నామపత్రం దాఖలు చేసిన మార్గాని అమ్మాణి... తదనంతరం జరిగిన సర్పంచి ఎన్నికల్లో కడియపులంకకు అదే పార్టీ నుంచి సర్పంచిగా నామప్రతాన్ని దఖలు పరిచారు. సర్పంచిగా విజయాన్ని అందుకున్నారు. కాగా ఆదివారం జడ్పీటీసీ అభ్యర్థినిగా ఆమె విజయం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని