నిమజ్జనానికి వెళ్లి.. యువకుడి గల్లంతు
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

నిమజ్జనానికి వెళ్లి.. యువకుడి గల్లంతు


మడికి రాజు

 

మండపేట: స్థానిక గొల్లపుంత కాలనీకి చెందిన మడికి రాజు(26) అదే వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఆదివారం పెదకాలువ వద్దకు ఊరేగింపుతో వెళ్లాడు. నిమజ్జనం అనంతరం వీరభద్రపురం రేవు వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలోకి జారి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేయగా అప్పటికే చీకటి పడడంతో సోమవారం పట్టణ సీఐ నున్న రాజు పర్యవేక్షణలో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దుర్గారాణి రాజు కుటుంబసభ్యులతో మాట్లాడారు. తమ తండ్రి రాకకోసం అతని ఇద్దరు చిన్న పిల్లలు ఎదురుచూస్తున్నారు. రాజు సోదరుడు మడికి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.రాజేష్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని