చరవాణి కొనివ్వలేదని..తండ్రిని హతమార్చిన తనయుడు
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

చరవాణి కొనివ్వలేదని..తండ్రిని హతమార్చిన తనయుడు


జయరాజ్‌ (పాత చిత్రం)

ఉప్పలగుప్తం: చరవాణి కొనుక్కునేందుకు డబ్బులివ్వలేదని కొడుకు తండ్రిని చంపేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామం బొర్రాయిపాలెం ప్రాంతంలో బొంతు జయరాజ్‌(50) ముగ్గురు కొడుకులతో కలిసి ఉంటున్నారు. అతని భార్య మంగాదేవి ఏడాది కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లారు. అప్పులు తీర్చేందుకు వారం కిందట భర్తకు రూ.30 వేలు పంపారు. ఆ నగదులో చరవాణి కొనుగోలుకు రూ.5 వేలివ్వాలంటూ రెండో కొడుకు రవి తండ్రితో వారం రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో రవిని అన్న కృష్ణ ఆదివారం మందలించారు. కక్ష పెంచుకున్న రవి ఆదివారం రాత్రి మద్యం తాగొచ్చి నిద్రిస్తున్న తండ్రిపై ఇనుప గొట్టంతో దాడి చేశాడు. ఆయన కేకపెట్టడంతో పక్క గదిలో నిద్రిస్తున్న కృష్ణ విని బయటికొచ్చాడు. అతన్నిచూసి రవి పారిపోయాడు. తల నుంచి రక్తం కారుతున్న తండ్రిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసినట్లు అమలాపురం గ్రామీణ సీఐ సురేష్‌బాబు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని