జడ్పీ ఛైర్మన్‌గా విప్పర్తి .?
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

జడ్పీ ఛైర్మన్‌గా విప్పర్తి .?

 

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, పి.గన్నవరం: జిల్లాలో అత్యధిక జడ్పీటీసీ స్థానాలు దక్కించుకుని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పీఠాన్ని అధికార పక్షం పదిలపరుచుకుంది. ఛైర్మన్‌ ఎన్నికకు యంత్రాంగం నోటీసు జారీచేయడంతో ఇక పీఠం ఎక్కడమే తరువాయి. ఎస్సీ జనరల్‌కు జడ్పీ పీఠం రిజర్వేషన్‌ కింద దక్కిన విషయం తెలిసిందే. అర్హుల రేసులో 23 మంది ఉన్నారు. జిల్లాపరిషత్తు ఛైర్మన్‌గా జలవనరుల శాఖ విశ్రాంత ఎస్‌ఈ విప్పర్తి వేణుగోపాలరావును అధిష్ఠానం ఖరారు చేసిందని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. జలవనరుల శాఖలో సేవలందించిన ఈయన 2012లో ఉద్యోగ విరమణ అనంతరం వైకాపాలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. ప్రస్తుతం వేణుగోపాలరావు వైకాపా జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రతికూల పవనాలు వీచినా..

పి.గన్నవరంలో 22 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో ఏడు తెదేపాకు, అయిదు జనసేనకు, ఒకటి బీఎస్పీకి దక్కాయి. ఎంపీటీసీ స్థానాల్లో అధికార పక్షానికి ప్రతికూల గాలి వీచినా.. జడ్పీటీసీగా విప్పర్తికి సానుకూల ఫలితం రావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని