కసరత్తు
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

కసరత్తు

24, 25న మండల, జడ్పీ అధ్యక్షుల ఎన్నిక

కాకినాడ కలెక్టరేట్‌: జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. 24న మండల పరిషత్తు అధ్యక్షుడు (ఎంపీపీ), ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎన్నికకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 60 మండల పరిషత్‌లలో అధ్యక్ష ఎన్నికకు 24న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి మండల పరిషత్‌కు ఒక కో-ఆప్షన్‌ సభ్యుడ్ని ఎన్నుకోవాలి.ఆ రోజు ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం 12 గంటల్లోపు పరిశీలిస్తారు. ఆపై నామినేషన్లను ప్రచురించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉపసంహరణకు వీలు కల్పిస్తారు. ఆ వెంటనే కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో ఎంపీటీసీ విజేతలు చేతులు ఎత్తే విధానంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు

జడ్పీ ఛైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు, ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను 25న జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తారు.ఉదయం 10 గంటలకు ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నుకుంటారు. 3 గంటలకు జడ్పీటీసీ విజేతలతో సమావేశం పెట్టి అధ్యక్ష, ఇద్దరు ఉపాధ్యక్షులను నేరుగా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు ఒక జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఉండగా మరొకరు అదనంగా రానున్నారు. ఈ ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని