‘పల్లె’ నుంచి.. ప్రాదేశిక ప్రాతినిధ్యం..
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

‘పల్లె’ నుంచి.. ప్రాదేశిక ప్రాతినిధ్యం..


మోకా రామారావు

 

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అయినాపురం సర్పంచి మోకా రామారావు ఎంపీటీసీ-2 స్థానంలోనూ విజయం సాధించారు. గతేడాది ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశాక ఎన్నికల ప్రక్రియ నిలిచింది. ఆ తరువాత స్థానిక ఎన్నికల్లో పోటీచేసి సర్పంచిగా 387 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది ఎంపీటీసీ స్థానానికి వేసిన నామినేషన్‌ అలాగే ఉండడంతో పోటీలో నిలిచారు. ఆదివారం జరిగిన ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో రామారావు 497 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని