ఉత్కంఠకు తెర.. మారేడుమిల్లి ఫలితం ప్రకటన
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

ఉత్కంఠకు తెర.. మారేడుమిల్లి ఫలితం ప్రకటన


గొర్లె బాలాజీబాబు

 

మారేడుమిల్లి: మారేడుమిల్లి జడ్పీటీసీ స్థానం ఫలితంపై ఉత్కంఠకు తెరపడింది. గొర్లె బాలాజీబాబు (వైకాపా) ఎన్నికవగా.. ఆర్వో వై.సత్యనారాయణ నుంచి సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు వేళ జడ్పీటీసీతోపాటు, దొరచింతలపాలెం ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులో వివాదం నెలకొంది. పెట్టెల్లోని బ్యాలెట్‌ పేపర్లు తడిసిపోవడంతో అంతరాయం కలిగింది. దొరచింతలపాలెం ఎంపీటీసీ స్థానం లెక్కింపును రద్దు చేశారు. జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టారు. తమకు అన్యాయం జరుగుతోందని తెదేపా అభ్యర్థి రాజ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల సంఘం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఫలితాన్ని ప్రకటించలేదు.చివరికి ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని ఆదేశాలతో బాలాజీబాబు 548 ఓట్ల ఆధిక్యంతో గెలిచారని ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని