రాత పరీక్షలో సత్తా చాటండి
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

రాత పరీక్షలో సత్తా చాటండి


సూచనలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

 

బాలాజీచెరువు(కాకినాడ): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపికై పోలీసు శాఖలో విలీనం చేసిన మహిళా పోలీసులకు ఈ నెల 22, 23 తేదీల్లో ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మహిళా పోలీసులకు వీక్షణలో అవగాహన కల్పించారు. ప్రాజెక్టు వర్కు, ఫైలింగ్‌, పరీక్ష సిలబస్‌ను వివరించారు. రాత పరీక్షలో మార్కుల ఆధారంగా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఉంటుందన్నారు. ముందుగా ఎంచుకున్న స్లాట్‌లో రాత పరీక్షకు హాజరుకావాలన్నారు. తర్వాత సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారులతో సమీక్షించారు. రాత పరీక్షా కేంద్రాల్లో వసతులు సమకూర్చాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు చేరేందుకు రవాణా సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కరణం కుమార్‌, డీఎస్పీలు అంబికాప్రసాద్‌, మురళీమోహన్‌, సీఐ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని