నేరాంధ్రగా మార్చేశారు: గోరంట్ల
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

నేరాంధ్రగా మార్చేశారు: గోరంట్ల


మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

క్వారీసెంటర్‌: పోలీసు వ్యవస్థ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడంతో దాడులు పెరుగుతున్నాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మాట్లాడారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చినా.. అధికారం మాత్రం సజ్జల చేతుల్లో ఉండటంతో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తే తనపైన, మాజీ మంత్రి జవహర్‌పై పోలీసులు కేసు పెట్టడం, నిర్బంధించడం దారుణమన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో అధికార పార్టీ వారి ర్యాలీలను ఎస్పీ ఎలా అనుమతించారన్నారు. అధికారులు, పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలే తప్ప అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారతాయనే విషయాన్ని గమనించాలన్నారు. కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టండి... తెదేపాకు ప్రజాబలం ఎంతుందో చూపిస్తామన్నారు. సీఎం జగన్‌.. కేసులకు భయపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవడం లేదనీ.. ప్రధాని మోదీ ఏకంగా జాతినే అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని