జీవో 217కు వ్యతిరేకంగా ఆందోళన
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

జీవో 217కు వ్యతిరేకంగా ఆందోళన


కొండబాబుతో కలిసి మత్స్యకారుల నిరసన

 

కాకినాడ కలెక్టరేట్‌: మత్స్యకారుల వృత్తికి విఘాతం కలిగించే చెరువులు ఆన్‌లైన్‌ వేలం ఉత్తర్వును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద మత్స్యకారుల ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అంపోలు సత్యనారాయణ మాట్లాడుతూ నదులు, జలాశయాలు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో చేపలవేట ద్వారా జీవనం సాగిస్తున్న మత్య్సకారుల జీవనోపాధిని కొల్లగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) మాట్లాడుతూ రాష్ట్రంలో 3,415 చెరువులపై 3,500 సహకార సంఘాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీవో నంబరు 217ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్వో సీహెచ్‌.సత్తిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు నాగిడి నాగేశ్వరరావు, కర్రి చిట్టిబాబు, వాడ్రేవు వీరబాబు, తుమ్మల రమేశ్‌, సేరు చిన్నా పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని