కాకినాడలో మహిళ దారుణహత్య
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

కాకినాడలో మహిళ దారుణహత్య

 


కామిశెట్టి సుబ్బలక్ష్మి

సర్పవరం జంక్షన్‌: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్యచేసి, బంగారుగొలుసు చోరీ చేసిన ఘటన ఇది. సీఐ రాజశేఖర్‌ వివరాల ప్రకారం.. గోడారిగుంటలోని శంతనపురికాలనీ పల్లిపేటలో ఉంటున్న కామిశెట్టి సుబ్బలక్ష్మి(46) గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడచుట్టూ తువ్వాలుతో ఉరిబిగించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. సుబ్బలక్ష్మి భర్త సౌదీలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. కాకినాడ లలితానగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న కుమార్తెతో కలిసి ఆమె సొంత ఇంటిలో ఉంటున్నారు. సాయంత్రం ఆమె కూతురు ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఇంటి వెనుక ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూశారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా తల్లి చనిపోయి ఉందని, మెడలోని నాలుగు కాసుల గొలుసు కనిపించలేదు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని