త్రివిధ దళాల్లో యువత చేరేలా ప్రోత్సాహం 
eenadu telugu news
Updated : 24/09/2021 06:39 IST

త్రివిధ దళాల్లో యువత చేరేలా ప్రోత్సాహం 


మాట్లాడుతున్న డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ టీఎస్‌ఎస్‌ కృష్ణన్‌, పక్కన రుషి

మసీదుసెంటర్‌(కాకినాడ): ఎన్‌సీసీ శిక్షణతో యువతలో క్రమశిక్షణ, ఐక్యతతోపాటు త్రివిధ దళాల్లో చేరే విధంగా ప్రోత్సహించడమే లక్ష్యమని ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎయిర్‌ కమడోర్‌ టీఎస్‌ఎస్‌ కృష్ణన్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కాకినాడ వచ్చిన ఆయన ఎన్‌సీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ చదువులకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది, నిధుల కొరత, ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎన్‌సీసీని కొన్ని విద్యాలయాల్లోనే నిర్వహించగలుగుతున్నామని చెప్పారు. గత ఆరేళ్లలో కొత్త కళాశాలలు, విద్యాలయాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. కల్నల్‌ ఎ.కె.రిషి తదితర ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని