Suicide: పెళ్లయిన పది రోజులకే బలవన్మరణం
eenadu telugu news
Updated : 24/09/2021 12:08 IST

Suicide: పెళ్లయిన పది రోజులకే బలవన్మరణం

గెడం హరనాథ్‌ (పాత చిత్రం)

రాజోలు: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలోననే మానసిక ఆందోళనకు గురయ్యాడు. పది రోజులకే.. ఉరేసుకుని ఉసురుతీసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సై బి.కృష్ణమాచారి చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని సోంపల్లికి చెందిన గెడ్డం హరనాథ్‌(22) పొన్నమండలో బంధువుల ఇంట్లో ఉండేవాడు. ఇంటర్‌ చదివిన అతను పొన్నమండకు చెందిన యువతిని ప్రేమించి ఈ నెల 10న వివాహం చేసుకున్నాడు. హరనాథ్‌ తల్లి, సోదరుడు విదేశాల్లో ఉంటున్నారు. ప్రేమపెళ్లి గురించి వారికి చెప్పలేక మథనపడ్డాడు. బుధవారం రాత్రి ములికిపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు సోదరుడైన గెడ్డం రాజేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని