ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి: మేయర్‌
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి: మేయర్‌

బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి నుంచి తనకు రక్షణ కల్పించాలని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు మేయర్‌ పావని ఫిర్యాదు చేశారు. మహిళా మేయర్‌గా, నగర ప్రథమ పౌరురాలిగా రక్షణ లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో నాలుగు రోజులుగా అల్లరి మూకలు తన ఇంటి వద్ద గుమిగూడి, ద్విచక్ర వాహనాలతో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. బుధవారం సుమారు 15 మంది రౌడీ మూకలు పాత్రికేయుల సమక్షంలో దాడికి యత్నించారన్నారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వీటిని తొలగించాలని మేయర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని