పవన్‌ వ్యాఖ్యలు సరికాదు: ఎంపీ
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

పవన్‌ వ్యాఖ్యలు సరికాదు: ఎంపీ

వి.ఎల్‌.పురం: కడియం మండలం పొట్టిలంకలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి ఓటమిపై జనసేన అధినేత పవన్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం మాట్లాడుతూ, పొట్టిలంక గ్రామాన్ని తాను దత్తత తీసుకుందిరాజకీయాలు చేయడానికి కాదని, నియోజకవర్గానికి శివారులోని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికేనని అన్నారు.ఇక్కడ జనసేన ప్రాబల్యం ఎక్కువని అందరికీ తెలుసనీ, అయినాపోటీ ఇవ్వాలనే తమ పార్టీ అభ్యర్థిని నిలిపామన్నారు. ఆ అభ్యర్థి జనసేనతో కలిసిపోవడంతో ఓటమి చెందామన్నారు. సర్పంచి ఎన్నికల్లో వైకాపా మద్దతు అభ్యర్థి గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలనిఅన్నారు. పురుషోత్తపట్నం భూములకు నష్టపరిహారం వ్యవహారంపై మాట్లాడుతూ, ఆ రైతులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. వారి సమస్య చెప్పుకోవడానికి పరిషత్‌ ఎన్నికల ఫలితాల సమయంలో తనను కలిసినప్పుడే వారిని చూశానని, వైఎస్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీతానగరం వెళ్లినప్పుడుతనను కలవడానికి వారొచ్చారనే సమాచారం తనకు ఉందని అన్నారు. వైకాపాలో నాయకుల మధ్య విభేదాలను అధిష్ఠానం చూసుకుంటుందనీ, పార్టీలో ఉన్నవారంతా తన వెంటే ఉండాలనే నిబంధన ఏమీ లేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని