అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం


మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ధర్మాన మాట్లాడుతూ విజిలెన్స్‌ కమిటీ సభ్యులు తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ, కాకినాడలోని అంబేడ్కర్‌ భవన్‌ ఆధునికీకరణకు ఉప ప్రణాళిక నుంచి కనీసం రూ.10 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరో మంత్రి వేణు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ,ఈ ఏడాది 71 అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ.37.17 లక్షల పరిహారం అందించామన్నారు. ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, జేసీలు లక్ష్మీశ, భార్గవ్‌తేజ, డీఆర్వో సత్తిబాబు, సబ్‌కలెక్టర్లు ఇలాక్కియా, కట్టా సింహాచలం, జేడీ రంగలక్ష్మీదేవి, జడ్పీ సీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.

‘ధ్రువపత్రం జారీకి మూడేళ్లా..?’

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి మూడేళ్లు సమయం పట్టిందంటే జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. బాధితుల బంధువులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి జాప్యం చేస్తున్నారన్నారు. శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎస్సీలను బాధించిందని మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు అయితాబత్తుల రామేశ్వరరావు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని